వైవిధ్యమైన కధాంశాలున్న చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు సూర్య. ఈ ఏడాది ఆయన ‘కంగువా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన కొత్త చిత్రం టైటిల్ టీజర్ క్రిస్మస్ సందర్భంగా నేడు విడుదలైంది. ‘రెట్రో’ గా రానున్న ఈచిత్రం ఆయనకు 44వది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. సూర్య లుక్ ఆకట్టుకునేలా ఉంది.
Previous Articleశతజయంతి సందర్భంగా ‘అటల్ సదైవ్’ వద్ద ప్రముఖుల నివాళులు
Next Article శ్రీ తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం