మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచి వినోదాత్మక కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా రూపుదిద్దుకుంటోంది. మెగాస్టార్ నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా అనిల్ ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఇక ఈరోజు చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘పండగకి వస్తున్నారు..’ అనేది ట్యాగ్‌లైన్. ఇక, ఈ గ్లింప్స్‌కు విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. చిరంజీవి స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నయనతార చిరు సరసన కనిపించనున్నారు. 2026 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
By admin1 Min Read