నేడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఈమేరకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం గారి ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందాం.
మంత్రి నారా లోకేష్:
స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్యం నిరుపమానం. సైమన్ గో బ్యాక్ అంటూ బ్రిటీష్ వారి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా పేరుగడించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు విశేష కృషిచేశారు. వారి ఆశయసాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దాం.
త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
By admin1 Min Read