కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసింది. ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది. అది రెండు ప్రభుత్వాలకు ఉన్న తేడా అని అన్నారు. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా కానే, వైసీపీ లాంటి ఫేక్ పార్టీని చూడలేదని విమర్శించారు. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే సిద్దాంతంగా వైసీపీ పనిచేస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం, చెత్త మీద పన్ను వేశారు కానీ, చెత్త ఎత్తకుండా వెళ్ళిపోయారు. 85 మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తకుండా వదిలేసి వెళ్లారు. ఇప్పటికే ఈ చెత్త తొలగింపు మొదలు పెట్టాం. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలో ఈ చెత్త మొత్తం తొలగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు బీమా మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటినిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికులకు వివరించారు.