భారత పాకిస్తాన్ లో మధ్య క్రీడా ద్వైపాక్షిక సంబంధాలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపై కూడా ఈ సిరీస్ లు ఉండవని తెలిపింది. అయితే ఆసియా కప్ లో పాల్గొనడం పట్ల వెసులుబాటు కల్పించింది. మిగిలిన జట్లు కూడా పాల్గొనే టోర్నీ కావడంతో ఆసియా కప్ లో పాల్గొనకుండా ఆపబోమని పేర్కొంది. పాకిస్థాన్ తో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పై కొత్త క్రీడా విధానాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. భారత క్రీడాకారులు పాకిస్థాన్ లో పర్యటించకుండా నిషేధం విధించినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపాయి. వేరే దేశాలు కలిసి పాల్గొనే టోర్నీలలో పాకిస్థాన్ లో భారత్ పర్యటించాల్సి వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు