భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ మరో సంవత్సరం పొడిగించింది. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఛైర్మన్ గా అగార్కర్ కొనసాగనున్నాడు. 2023 జులైలో అతడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యాడు. ఆ సంవత్సరం వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టు 2024లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టైటిల్ విజేతగా నిలిచింది. జట్టు అప్రతిహతంగా దూసుకెళ్తుండడంలో సెలక్షన్ కమిటీది కీలకపాత్ర.
Previous Articleమెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్
Next Article ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు