రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని ఏపీ మానవాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఏటా డిఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ విద్యలో ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మోడల్ తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలని, ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా ఆదేశించారు.
నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలి: లోకేష్
నైపుణ్య విభాగం అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. సెప్టెంబర్ లో పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. పీఎం ఇంటర్నషిప్ స్కీమ్ తో నైపుణ్యం పోర్టల్ ను అనుసంధానించాలని సూచించాను. నైపుణ్యం పోర్టల్ డెమోను పరిశీలించాను. ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యకు సంబంధించిన అంశాలపైనా చర్చించడం జరిగింది. దృష్టి లోపం గల విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు