Author: admin

కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసింది. ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది. అది రెండు ప్రభుత్వాలకు ఉన్న తేడా అని అన్నారు. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా కానే, వైసీపీ లాంటి ఫేక్ పార్టీని చూడలేదని విమర్శించారు. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే సిద్దాంతంగా వైసీపీ పనిచేస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం, చెత్త మీద పన్ను వేశారు కానీ, చెత్త ఎత్తకుండా వెళ్ళిపోయారు. 85 మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తకుండా వదిలేసి వెళ్లారు. ఇప్పటికే ఈ చెత్త తొలగింపు మొదలు పెట్టాం. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలో ఈ చెత్త మొత్తం తొలగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు బీమా మంజూరు…

Read More

నేడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఈమేరకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు: తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం గారి ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందాం. మంత్రి నారా లోకేష్: స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్యం నిరుపమానం. సైమన్ గో బ్యాక్ అంటూ బ్రిటీష్ వారి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా పేరుగడించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు…

Read More

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని ఏపీ మానవాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఏటా డిఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ విద్యలో ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మోడల్ తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలని, ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలి: లోకేష్ నైపుణ్య విభాగం అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. నైపుణ్యం పోర్టల్ ను…

Read More

ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. కాగా, ఈరోజు బీహార్‌లోని గయలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ఈసందర్భంగా స్పష్టం చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. దీనికి సంబంధించిన మూడు కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు. ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోకి దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన…

Read More

కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.ఎరువుల లభ్యత, సరఫరా, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపై కూడా ఈసందర్భంగా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులతో సీఎం సమావేశం కానున్నారు.

Read More

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచి వినోదాత్మక కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా రూపుదిద్దుకుంటోంది. మెగాస్టార్ నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా అనిల్ ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఇక ఈరోజు చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాకి ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’ అనే టైటిల్‌ ను ఖ‌రారు చేశారు. ‘పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇక‌, ఈ గ్లింప్స్‌కు విక్ట‌రీ వెంక‌టేశ్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. చిరంజీవి స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నయనతార చిరు సరసన కనిపించనున్నారు. 2026 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. https://youtu.be/W6TRMMVRGl4?si=n_ZneQBFIbGNnwqu

Read More

భారత పాకిస్తాన్ లో మధ్య క్రీడా ద్వైపాక్షిక సంబంధాలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపై కూడా ఈ సిరీస్ లు ఉండవని తెలిపింది. అయితే ఆసియా కప్ లో పాల్గొనడం పట్ల వెసులుబాటు కల్పించింది. మిగిలిన జట్లు కూడా పాల్గొనే టోర్నీ కావడంతో ఆసియా కప్ లో పాల్గొనకుండా ఆపబోమని పేర్కొంది. పాకిస్థాన్ తో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పై కొత్త క్రీడా విధానాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. భారత క్రీడాకారులు పాకిస్థాన్ లో పర్యటించకుండా నిషేధం విధించినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపాయి. వేరే దేశాలు కలిసి పాల్గొనే టోర్నీలలో పాకిస్థాన్ లో భారత్ పర్యటించాల్సి వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.

Read More

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ మరో సంవత్సరం పొడిగించింది. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఛైర్మన్ గా అగార్కర్ కొనసాగనున్నాడు. 2023 జులైలో అతడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యాడు. ఆ సంవత్సరం వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టు 2024లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టైటిల్ విజేతగా నిలిచింది. జట్టు అప్రతిహతంగా దూసుకెళ్తుండడంలో సెలక్షన్ కమిటీది కీలకపాత్ర.

Read More

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం నుంచి ఆయన పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్ తో ఘనంగా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. https://youtu.be/WPWNt8qhx94?si=2QTnwIF5uwJ_ESiE

Read More

ఇటీవల పరిణామాల నేపథ్యంలో భారత్- చైనా మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయి. వివాదాలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈక్రమంలో లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. కాగా, భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ నేపాల్ అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి అన్నారు. తమ మ్యాప్ లో ఇదే ఉందని అన్నారు. ఇప్పటికే ఈవిషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నారు. భారత్- నేపాల్ ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే నేపాల్ వాదనలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. లిపులేఖ్ ద్వారా భారత్- చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్…

Read More