ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘అటల్ సదైవ్’ లో నివాళులు అర్పించిన ఆయన అనంతరం ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. పోలవరం, అమరావతికి సాయంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సాయం అందించి ఆదుకోవాలని ప్రధానికి విన్నవించారు. ఇటీవల ఏపీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానికి అందజేశారు. ఇటీవల పార్లమెంటులో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ఏపీ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహాకారాలు అందించే అవకాశం ఉంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

