భారత క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లోనే మేటి పేస్ బౌలర్ గా కొనసాగుతున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను సమం చేశాడు. ప్రస్తుతం 904 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఘనతను అశ్విన్ 2016లో సాధించాడు. ఇక ప్రస్తుత ర్యాంకింగ్స్ లో బుమ్రా తరువాత 856 పాయింట్లతో సౌతాఫ్రికా పేసర్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజల్ వుడ్ 852 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు బ్యాటర్లలో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇంగ్లీష్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 876 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్ సన్ (867), ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (825) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుండి యశస్వీ జైశ్వాల్ 805 పాయింట్లతో టాప్ 5 లో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
Previous Articleప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
Next Article నో డిటెన్షన్ విధానం రద్దు..!

