బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 311-6తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ స్టీవ్ స్మిత్ 140(197;13×4, 3×6) సెంచరీతో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. పాట్ కమ్మిన్స్ 49 (63;7×4) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు,జడేజా 3 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదట్లోనే రోహిత్ శర్మ (3) వికెట్ కోల్పోయింది. కే.ఎల్.రాహుల్ 24 (42;3×4), జైశ్వాల్ 82(118;11×4,1×6), విరాట్ కోహ్లీ 36(86; 4×4) పరుగులు చేశారు. నైట్ వాచ్ మెన్ ఆకాష్ దీప్ (0) వికెట్ కూడా కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 310 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం రిషబ్ పంత్ 6 బ్యాటింగ్, రవీంద్ర జడేజా 4 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 474 ఆలౌట్:భారత్ 164-5
By admin1 Min Read