కుటుంబ కలహాలతో ఇటీవల నటుడు మోహన్ బాబు కుటుంబం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కుటుంబం మరోసారి వివాదంలో నిలిచింది. జల్ పల్లి అటవీప్రాంతం పక్కనే ఆయన ఇల్లు ఉంది. అక్కడ నెమళ్లు, జింకలు,ఇతర వన్యప్రాణులు ఉన్నాయి.మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ మరో ఇద్దరితో కలిసి తాజాగా అడవిపందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్న వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో కలకలం
రేపింది. దీనిని చూసిన పలువురు నెటిజన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు మంచు విష్ణు, అతని సిబ్బంది తనని ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల మనోజ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Previous Articleసంక్రాంతి బరి నుండి తప్పుకున్న అజిత్ …!
Next Article గాయనితో బీజేపీ ఎంపీ వివాహం..!

