కొత్త సంవత్సరం తొలి రోజు 1,600 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ పై ఏపీ సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అంటే డిసెంబర్ 31 వరకు 7, 523 మందికి రూ.100 కోట్ల మేరకు సాయం చేయగా… ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేటికి మొత్తం 9, 123 మంది పేదలకు రూ. 124.16 కోట్ల సాయం అందించినట్లు అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.