రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి RGSA ద్వారా రికార్డ్ స్థాయిలో శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో మొత్తం 2,56,138 శిక్షణా సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానాన్ని సాధించింది. మొదటి స్థానంలో బిహార్ 2,63,623 శిక్షణలతో నిలిచింది. ఇక శిక్షణా లక్ష్యాన్ని పూర్తి చేసిన విభాగంలో 85.35% తో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. గత వైసీపీ ప్రభుత్వ హయంలో అంధ్రప్రదేశ్ 24వ స్థానంలో నిలవగా ప్రస్తుత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో 2వ స్థానానికి చేరింది. డిప్యూటీ సిఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తొలి ఆరు నెలల్లో సాధించిన పురోగతి ఇదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
Previous Articleఇకపై ఎయిర్ ఇండియా విమానంలో వైఫై సేవలు…!
Next Article ఫిష్ వెంకట్‌కు పవన్ సాయం..థ్యాంక్స్ చెప్పిన నటుడు