సంధ్య థియేటర్ ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ ఘటన విషయంలో అరెస్ట్ అయిన బన్నీ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.ఈ మేరకు దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తాజాగా ఆయనకు పూచీకత్తుతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
‘పుష్ప 2’ బెనిఫిట్ షో ప్రదర్శనలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందింది.ఆమె తనయుడు శ్రీతేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్నారు.