బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 9-1 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను భారత బౌలర్లు 181 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ కు 4 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియాను రెండో రోజు మన బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. వెబ్ స్టర్ 57 (105; 5×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టీవ్ స్మిత్ 33 (57; 4×4, 1×6) పర్వాలేదనిపించాడు. అయితే భారత కెప్టెన్ బుమ్రా గాయం కారణంగా మైదానం నుండి వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ లో అతను ఆడడం చాలా కీలకం. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, నితీష్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్:181-10 (55 ఓవర్లు)
శామ్ కొన్స్టాస్ 23 (38; 3×4) (సి) యశస్వీ జైశ్వాల్ (బి) సిరాజ్
ఉస్మాన్ ఖవాజా 2 (10) (సి) రాహుల్ (బి) బుమ్రా
మార్నస్ లబుషేన్ 2 (8) (సి) పంత్ (బి) బుమ్రా
స్టీవ్ స్మిత్ 33 (57; 4×4, 1×6) (సి) రాహుల్ (బి) ప్రసీద్
ట్రావిస్ హెడ్ 4 (3; 1×4) (సి) రాహుల్ (బి) సిరాజ్
వెబ్ స్టర్ 57 (105; 5×4) (సి) యశస్వీ జైశ్వాల్ (బి) ప్రసీద్
అలెక్స్ క్యారీ 21 (36; 4×4) (బి) ప్రసీద్
పాట్ కమ్మిన్స్ 10 (20; 1×4) (సి) కోహ్లీ (బి) నితీష్ కుమార్ రెడ్డి
మిచెల్ స్టార్క్ 1 (4) (సి) రాహుల్ (బి) నితీష్ కుమార్ రెడ్డి
నాథన్ లైయన్ 7 నాటౌట్ (17)
బోలాండ్ 9 (9; 2×4) (బి) సిరాజ్.