బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ 4 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని 145 పరుగుల ముందంజలో ఉంది. రిషబ్ పంత్ 61 (33;6×4, 4×6) విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. యశస్వీ జైశ్వాల్ 22 (35; 4×4) వేగంగానే ఆడాడు. రాహుల్ (13), గిల్ (13), విరాట్ కోహ్లీ (6), నితీష్ కుమార్ రెడ్డి (4) నిరాశ పరిచారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 6 బ్యాటింగ్, రవీంద్ర జడేజా 8 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లతో రాణించాడు. వెబ్ స్టర్ ఒక వికెట్, పాట్ కమ్మిన్స్ ఒక వికెట్ పడగొట్టారు.
సిడ్నీ టెస్టు: రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 141-6
By admin1 Min Read
Previous Articleమంత్రి లోకేష్ ని కలిసిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్
Next Article సౌరభ్ గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు …!