విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‍లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ప్రారంభించే ముందు, కళాశాల విద్యార్ధులతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వైపు వెళ్ళవద్దని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకోవాలని సూచించారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని మంచి ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
జీవితంలో గెలుపు ఓటములు సహాజమేనని తాను 2019 లో మంగళగిరిలో ఓడిపోయి తిరిగి 2024 లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకుంటున్నారని విద్యార్థులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే విద్యా శాఖలో పధకాలకు మహోన్నత వ్యక్తులు పేర్లు పెట్టాం. టీచర్ల పై యాప్ ల భారం తగ్గించినట్లు పేర్కొన్నారు.
విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
By admin1 Min Read