దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గేమ్‌ఛేంజర్”.ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10 న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సినిమా టికెట్ ధరలు పెంచుతూ…తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.బెనిఫిట్ షో కు రూ.600 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని పేర్కొంది
ఈ మేరకు మల్టీప్లెక్స్‌ల్లో అదనంగా రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జనవరి 11వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇవే ధరలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ తేదీల్లో రోజుకు 5 షోలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతినిచ్చింది.విడుదల తేదీ మాత్రం ఆరు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది.ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.