మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈచిత్రం నుండి తాజాగా కాజల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆమె ఈచిత్రంలో జగన్మాత పార్వతీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ముల్లోకాలు ఏలే తల్లి ! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి !శ్రీ కాళ హస్తి లో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ! అని ఉన్న పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. పలు భాషల్లో రూపొందుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) January 6, 2025