మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో డబుల్స్ లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-10, 16-21, 21-5తో చైనీస్ తైపీ కి చెందిన మింగ్ చి లు, కైవి టాంగ్ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో 21-12, 17-21, 21-15తో కెనడాకు చెందిన బ్రయాన్ యాంగ్ పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ మలేషియాకు చెందిన జిన్ వీ పై 21-15, 21-16తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్ చేరింది. ప్రియాన్షు రజావత్ చైనా క్రీడాకారుడు షై ఫెంగ్ చేతిలో 11-21, 16-21తో పరాజయం చెందాడు.
Previous Articleతిరుపతిలో తీవ్ర తోపులాట:ఆరుగురు భక్తులు మృతి
Next Article బాక్సింగ్ లో కొత్త వెయిట్ విభాగాలు