టాలీవుడ్ యువ కథానాయకుడిగా శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం.ఈ సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఇద్దరు భామలు అరుస్తుంటే..శర్వానంద్ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో పోస్టర్ లో చూడచ్చు.ఇందులో శర్వానంద్ కు జోడిగా సంయుక్తా మీనన్,సాక్షి వైద్య నటిస్తున్నారు.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
Previous Article“హరిహర వీరమల్లు ” ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల…!
Next Article ప్రభాస్ “రాజాసాబ్” నుండి కొత్త పోస్టర్ విడుదల…!