రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రాజాసాబ్”. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకె్కిస్తున్నారు.ఇందులో మాళవిక మోహనన్,నిధి అగర్వాల్ లు ప్రభాస్ కు జోడిగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా అప్‌డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు,సంక్రాంతి శుభాకాంక్షలతో అప్డేట్ ఇచ్చింది.డార్లింగ్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు…మనం ఎపుడు వస్తే అప్పుడే అసలైన పండగ…త్వరలో చితక్కొట్టేద్దాం. రాజాసాబ్ త్వరలోనే థియేటర్లలో మిమ్మల్ని కలుస్తాడు…విడుదల చేసిన పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.