ఇటీవల వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు భారత జట్టుపై విమర్శలకు కారణమయ్యాయి. న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్, బోర్డర్- గావస్కర్ సిరీస్ ఓటముల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా సితాన్షు కోటక్ ను బీసీసీఐ తాజాగా నియమించింది. త్వరలో ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్, ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 52 ఏళ్ల ఈ సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సుదీర్ఘ కాలంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లలో భారత సీనియర్, ‘ఎ’ జట్ల పర్యటనల్లో కోచ్ గానూ వ్యవహారించాడు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలో టీన్ఇండియా ప్రధాన కోచ్ గా ఉన్నాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు