ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-15, 21-13 తేడాతో జపాన్ కు చెందిన మనామి సుయిజు పై గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం సింధు ఆధిపత్యం కనబరిచింది. వరుస గేమ్లల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించి కొత్త సంవత్సరం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిరణ్ జార్జ్ 22-20, 21-13తో ఫ్రాన్స్ కు చెందిన అలెక్స్ లేనియర్ పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కూడా క్వార్టర్స్ చేరింది. 20-22, 21-14, 21-16తో జపాన్ కు చెందిన మిత్సుహాషి-ఒకమురాపై విజయం సాధించింది.
ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన భారత షట్లర్లు
By admin1 Min Read