మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. పురుషులు, మహిళల విభాగాల్లో అత్యద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ పై ఘనవిజయం సాధించింది. ఆరంభం నుంచే మన జట్టు దూకుడుగా ఆడింది. కెప్టెన్ ప్రియాంక , వైష్ణవి రాణించడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆద్యంతం అదే బాటలో కొనసాగి టైటిల్ కైవసం చేసుకుంది. పురుషుల ఫైనల్ లో భారత్ 54-36తో నేపాల్ పై నెగ్గింది. ఖోఖో ప్రపంచకప్ లో సత్తా చాటిన భారత జట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తినిస్తుందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు