ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల బృందంతో కలిసి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. తరువాత హయత్ హోటల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు కృషి చేయనున్నారు.
Previous Articleఖోఖో ప్రపంచకప్ లో చరిత్ర సృష్టించిన భారత్
Next Article స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు..!