దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటుచేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ ను ఏర్పాటు చేయాలని ఈసందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారత్ లో 13 డబ్ల్యుటిసి సెంటర్లు పనిచేస్తుండగా, 7 నిర్మాణంలో ఉన్నాయని, మరో 9చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని జాన్ డ్రూ తెలిపారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రవి లాంబ, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తో కూడా లోకేష్ సమావేశమై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఇక ఏఐ అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్ యువతని తయారు చేయటానికి, స్కిల్ డెవలప్మెంట్ తో పాటుగా, ఏఐ యూనివర్సిటీ పెడుతున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐతో నాణ్యమైన విద్యను అందించనున్నట్లు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివరించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ
By admin1 Min Read
Previous Articleమహా కుంభమేళా చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
Next Article ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అడిషనల్ జడ్జిల నియామకం

