వచ్చే నెలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ తర్వాత అంత స్థాయిలో ప్రాధాన్యత ఉన్న టోర్నీ ఇదే కావడంతో క్రికెట్ అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ జెర్సీ నిబంధనలకు భారత జట్టు కట్టుబడి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండటంపై బీసీసీఐ అభ్యంతరం చెబుతోందన్న వార్తలను సైకియా తోసిపుచ్చారు. బీసీసీఐ ఐసీసీ ప్రతి నియమాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. నిబంధనల విషయంలో మిగిలిన జట్లు ఎలా చేస్తే భారత్ కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ:భారత జట్టు జెర్సీలపై ఆతిథ్య దేశం పాక్ పేరుపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ
By admin1 Min Read