దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చిందని, ఒకే వాయిస్ గా పాల్గొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ నుండి ఈ సదస్సులో పాల్గొంటున్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే, పరస్పరం ప్రోత్సహించుకున్నాయని వివరించారు. తమకు విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా, ఒకటిగా కలసి పనిచేస్తామని తెలిపారు. భారత దేశం బ్రాండ్ ఇప్పుడు చాలా బలంగా ఉందన్నారు . దావోస్ లో వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడుతున్నాయి. అంతా ఐక్యంగా దేశం కోసం కలిసి పని చేస్తున్నాం. సీఎంలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. తామంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారిమైనప్పటికీ ఇండియా ఫస్ట్, అవర్ పీపుల్ ఫస్ట్ నినాదంతో ఉన్నామని స్పష్టం చేశారు. మేం దావోస్ నుండి టెక్నాలజీని తీసుకెళ్లడానికి రాలేదు. ప్రపంచానికే మా దేశం టెక్నాలజీని అందజేస్తోంది, అది మా భారతీయుల సత్తా అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులేనని చెప్పారు.
బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ:
ఈ భేటీ సందర్భంగా ‘1995లో ఐటీ.. 2025లో ఏఐ’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో భేటీలో ‘ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రో సాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. సౌతిండియా లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్ వే గా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని దీనిద్వారా ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వాములు కావాలని బిల్ గేట్స్ ను ఆహ్వానించారు. ఆఫ్రికా తరహాలో హెల్త్ డ్యాష్ బోర్డు ఏర్పాటుకు సహకరించాలని కోరారు, గేట్స్ సలహాలు రాష్ట్ర ఐటీ అభివృద్ధికి దోహదపడతాయని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చంద్రబాబు లోకేష్ లకు హామీ ఇచ్చారు.
ఇండియా ఫస్ట్, అవర్ పీపుల్ ఫస్ట్ నినాదంతో ఉన్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin2 Mins Read
Previous Articleఛాంపియన్స్ ట్రోఫీ:భారత జట్టు జెర్సీలపై ఆతిథ్య దేశం పాక్ పేరుపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ
Next Article 99 కోట్లు దాటిన మన దేశ ఓటర్ల సంఖ్య