సినీ రంగానికి చేసిన సేవలకు గానూ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది.తాజాగా దీనిపై ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికీ నా ధన్యవాదాలు. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు.
Previous Articleగణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకర్షించిన మోదీ టోపీ
Next Article విజయ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే…!