‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ఈ పెద్ద పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్‌ను సొంతం చేసుకుంది. తాజాగా దీని వసూళ్లను చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.260 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. త్వరలోనే రూ.300 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని టీమ్ వెల్లడించింది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా గత 24 గంటల్లో బుక్‌మైషోలో లక్షా 70వేల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ యూనిట్ తెలిపింది. విడుదలైన నాటి నుంచి థియేటర్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన విషయం విధితమే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మించారు. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు