తిరుపతిలో జరిగిన 3160 -డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ 41వ వార్షిక సమావేశంలో ఏపీ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. సామాజిక సేవలకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన రోటరీ క్లబ్ తో తనకు విశేష అనుబంధం ఉందని మంత్రి తెలిపారు. 1905లో షికాగోలో పౌల్ హారిస్ స్థాపించిన రోటరీ క్లబ్ తన సేవలతో అంతర్జాతీయంగా విస్తరించి నేడు మహా వృక్షమైందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రోటరీ క్లబ్ చేసిన, చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, విలువల పెంపు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ.. ఇలా ఎన్నో రకాల సేవలందిస్తున్న రోటరీ క్లబ్ సేవాభావం అద్వితీయమైనదని కొనియాడారు. వివిధ రంగాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే కాకుండా, రోటరీ క్లబ్ ద్వారా సామాజిక రంగం పురోగతికి చేయందిస్తున్న క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నో స్కూళ్లు, హాస్పిటల్స్ తదితర వాటికి స్థలాలిచ్చిన రోటరీ క్లబ్ సభ్యులు ఆదర్శవంతమైన దాతలని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నా కుటుంబమే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్లు, సమాజం, దేశం కూడా బాగుండాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. వాళ్ల భవిష్యత్తు, వాళ్ల పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తూ సమాజం కోసం పాటుపడుతున్న రోటరీ క్లబ్ సభ్యులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు