గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఏడు నెలల్లోనే రూ.6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా 4,10,125 మంది యువత రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలని సూచించారు.
ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి. ఏడేళ్ల తరువాత ప్రకటించిన మెగా డిఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థ లో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు విసీల నియామకం, రిక్రూట్మెంట్, తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వివరించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి: నారా లోకేష్
By admin1 Min Read