మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. నేడు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో 9 వికెట్ల తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటయింది. మైకే వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్. జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), కరాబో మెసో (10) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3 వికెట్లు, వైష్ణవి శర్మ 2 వికెట్లు, ఆయుషీ శుక్లా 2 వికెట్లు, పరూనికా సిసోడియా 2 వికెట్లు, శుభమ్ షకీల్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ గొంగడి త్రిష 44 నాటౌట్ (33; 8×4), సానికా 26 నాటౌట్ (22; 4×4) రాణించడంతో ఓవర్లలోనే విజయ తీరాలకు చేరింది.
Previous Articleభూమి వైపుగా మరో భారీ గ్రహాశకలం:నాసా చెబుతోంది ఇదే..!
Next Article చిరు – బాబీ కలయికలో మరో కొత్త చిత్రం..?