భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 135 (54; 7×4, 13×6) విధ్వంసకర బ్యాటింగ్ తో భారీ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. శివమ్ దూబే (30), తిలక్ వర్మ (24) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రిడన్ కార్సే 3 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జామీ ఓవర్టన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్ 55 (23; 7×4, 3×6) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లు మొదట్లో పరుగులిచ్చినా తరువాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టారు. మహామ్మద్ షమీ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు, శివమ్ దూబే 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్ లో సెంచరీతో పాటు బౌలింగ్ లో రెండు వికెట్లతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Previous Articleచిరు – బాబీ కలయికలో మరో కొత్త చిత్రం..?
Next Article గుకేశ్ పై గెలిచి విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద