ఢిల్లీ రైల్ భవన్ లో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్ లో ఏపికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించాను. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్దఎత్తున డిమాండ్ రాబోతుంది. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని లోకేష్ కోరారు.మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.
ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఏపీలో ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి
By admin1 Min Read
Previous Articleఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: మొదలైన పోలింగ్
Next Article ఏపీలో కూడా కులగణన చేపట్టాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల