యుకిటో హిగాకితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
జపాన్‌లోని అతిపెద్ద షిప్‌బిల్డింగ్ సంస్థ ఇమాబారి షిప్‌బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ మిస్టర్ యుకిటో హిగాకి మరియు ప్రముఖ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన సోజిట్జ్ నుండి మిస్టర్ నిషిమురా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. షిప్‌బిల్డింగ్, గ్రీన్ రీసైక్లింగ్ మరియు షిప్ మెయింటెనెన్స్ యార్డులలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న విస్తృత అవకాశాల గురించి చర్చించారు. దేశీయ మరియు ప్రపంచ డిమాండ్ అవసరాలకు అనుగుణంగా నౌకానిర్మాణం మరియు గ్రీన్ టెక్నాలజీలలో యువత నైపుణ్యం గురించి కూడా మేము చర్చించాము. మన రాష్ట్రంలో వృద్ధి మరియు ఉపాధిని పెంచే ఫలవంతమైన సహకారాల కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మాడుగుల నాగఫణి శర్మను సత్కరించిన సీఎం
ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన్ను సచివాలయానికి ఆహ్వానించి సత్కరించారు. అవధానం బతకాలన్న ఆకాంక్షతో… ఐటీ ఉన్న ప్రాంతంలో మన సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరియాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో అవధాన సరస్వతీ పీఠానికి స్థలం ఇచ్చిన విషయాన్ని నాగఫణి శర్మ గుర్తుచేసుకున్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆశీర్వదించారని చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Previous Articleఏపీలో కూడా కులగణన చేపట్టాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article టీ20లలో అరుదైన ఘనత సాధించిన రషీద్ ఖాన్