ఈనెల 19 నుండి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ మొత్తం నలుగురు అంబాసిడర్ లను ప్రకటించింది. దీనికి భారత్ నుండి మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్ ఎంపిక చేసింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫ్ రాజ్ ఖాన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలను ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇందులో అంబాసిడర్గా ఆస్వాదించే అవకాశం లభించడం గౌరవప్రదమైన అంశం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి. ఇక ఈ టోర్నీలో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ప్రతి మ్యాచ్లో హోరాహోరీగా తలపడడం మనం చూస్తామని ధావన్ ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టలో ధావన్ కీలకపాత్ర పోషించాడు. 2013లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు