గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు.ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు.విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఆయన జైలుకు వెళ్లి,ములాఖత్ లో వంశీని కలుస్తారు.మరోవైపు జైల్లో వంశీని ఉంచిన సెల్ వద్ద భద్రతను పెంచారు.అదనంగా గార్డులను నియమించారు.
Previous Articleఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన తెలుగు తేజం త్రిపురాన విజయ్ కు కేంద్ర మంత్రి అభినందనలు
Next Article దేశ ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం…!