ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భద్రత సంబంధమైన కారణాలతో తమ జట్టును పాక్ కు పంపించమని బీసీసీఐ తేల్చిచెప్పడంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించనుంది.
పాకిస్థాన్ కూడా దీనికి తప్పక అంగీకరించింది. దీంతో భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడనుంది. ఇక భారత జట్టు తమ దేశానికి రాకపోవడంపై పాక్ అసహానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా చేసిన ఒక చర్యపై భారత అభిమానులు మండిపడుతున్నారు. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఈ టోర్నీ ఆడుతున్న ఎనిమిది దేశాలలో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ… భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించకపోవడం పట్ల భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. దాంతో నెటిజన్లు ఇది పాక్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారత జెండా లేకపోవడం వెనుక కచ్చితమైన కారణం తెలియకపోయినా, భారత జట్టు తన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లో ఆడుతుండటం దీనికి కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కరాచీ స్టేడియం ఈ టోర్నీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ లకు వేదికగా నిలవనుంది.
ఛాంపియన్స్ ట్రోఫికి ముందు మరో వివాదం..ఆ స్టేడియం పై కనిపించని భారత పతాకం..?
By admin1 Min Read