తిరుపతి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లతో పాటు ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ’, ‘మన టీడీపీ యాప్’, ‘సభ్యత్వ నమోదు’ తదితర పార్టీ కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన వారందరినీ ఈసందర్భంగా అభినందించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడాలని నాయకులకు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తే అధినేత అని తాను భావిస్తానని … సీనియర్లు, జూనియర్లు అని కాకుండా బాగా పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా వారికి చెప్పారు.
Previous Articleనేడు కూడా ఫ్లాట్ గానే సూచీల పయనం..!
Next Article విడుదలైన ఆది పినిశెట్టి ‘శబ్దం’ ట్రైలర్