ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా నేడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారీ ఛేజింగ్ ను ఆస్ట్రేలియా చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. డకెట్ 165 (143; 17×4, 3×6)భారీ శతకం తో సత్తా చాటాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. జో రూట్ 68 (78; 4×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. బట్లర్ (23), ఆర్చర్ (21 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షుయిస్ 3 వికెట్లు, జంపాల 2 వికెట్లు, లబుషేన్ 2 వికెట్లు, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆద్యంతం దూకుడైన ఆటతీరు కనబరిచింది. ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్ ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. వికెట్లు పడుతున్నా ఆస్ట్రేలియా ఎక్కడా తడబడలేదు. జాస్ ఇంగ్లిష్ 120 నాటౌట్ (86; 8×4, 6×6) సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించాడు. మ్యాథ్యూ షార్ట్ 63 (66; 9×4, 1×6), అలెక్స్ క్యారీ 69 (63; 8×4), లబుషేన్ 47 (45; 5×4), గ్లెన్ మ్యాక్స్ వెల్ 32 (15; 4×4, 2×6) మంచి ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, ఆర్చర్, కార్సే, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు