ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నుండి వైసీపీ వాకౌట్ చేసింది.ఈ మేరకు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ…మాజీ సీఎం జగన్ తో పాటుగా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుండి బయటకు వచ్చేశారు.అయితే మాజీ సీఎం,ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు.అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని చెప్పారు.
అయితే సభలో ఉంది రెండే పక్షాలని…ఒకటి అధికారపక్షమైన కూటమి, ఇంకొకటి ప్రతిపక్షమని చెప్పారు.రాష్ట్ర ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని,అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని అన్నారు.