నేడు ఏపీ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి దోహద పడేలా ఉంది. బడ్జెట్ లో సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిగాయని తెలిపారు. కూటమి హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. అన్ని వర్గాలను అండగా నిలిచేలా బడ్జెట్ కేటాయింపులున్నాయని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాల విధ్వంస పాలన నుండి బయటపడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టలెక్కించేందుకు ఒకవైపు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటుగా, మరోవైపు భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపించనుంది అని విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read