వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి,ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఏపీ సీఎం చంద్రబాబు,ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన నటుడు , మాజీ వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి…పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు.వైసీపీ నేత,ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,ఆయన తనయుడు వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్‌మీట్లలలో, సోషల్ మీడియాలో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానంటూ వాంగ్మూలం ఇచ్చారు.ఈ నేపథ్యంలో వారిద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ పెట్టుకున్నారు.
ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి లు
By admin1 Min Read