వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ తనకు రాసిన లేఖలో, బెదిరింపులు, ప్రేలాపనలు, అభియోగాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. టీవీల్లో అసంబద్ధ వాదన చేస్తున్నారు. హైకోర్టుకి కూడా వెళ్లారు. ఆ పిటిషన్‌కి విచారణ అర్హత ఉందో లేదో కూడా ఇంకా కోర్టు చెప్పలేదని అన్నారు. కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కదా అని సైలెంట్ గా ఉన్నాను. కానీ బయట మాత్రం, స్పీకర్‌కి నోటీసు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం, ఎప్పటినుండో ఉన్న సాంప్రదాయాల ప్రకారమే చేసాం. మాజీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి, మంత్రుల తరువాత, జగన్ కి ఎమ్మెల్యే హోదాలో ప్రమాణం చేయటానికి ఆహ్వానించామని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగం సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాల ప్రకారమే నిర్ధారించగలరని సభాపతి నిర్ణయమే ఫైనల్ అని సెక్షన్ 12(B) చెప్తుందని వివరించారు. ప్రతిపక్ష హోదా అర్హత గురించి జగన్ కి తెలియక కాదని ఇదే సభలో, గతంలో చంద్రబాబు గారిని బెదిరిస్తూ, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని బెదిరించిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశారు.
అన్నీ తెలిసి కూడా, జగన్, స్పీకర్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అనుకుని, జగన్ ని క్షమించి వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.మళ్ళీ ఇదే పునరావృతం అయితే మాత్రం, సభ మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష హోదాని, ఇవ్వటానికి మేము ఎవరు ?జగన్ మాత్రమే కాదు, మిగతా సభ్యులు కూడా రావటం లేదు. మీ నియోజకవర్గాల ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతని గుర్తు చేసుకుని, సభకు హాజరుకావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతని గుర్తు చేసుకుని సభకు హాజరు కావాలి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
By admin1 Min Read
Previous Articleబీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్స్…!
Next Article మహేష్ – రాజమౌళి చిత్రం నుండి లీక్స్…?