ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పీ.వీ.సింధుకు మొదటి రౌండ్ లోనే పరాభవం ఎదురైంది. 21-19, 13-21, 13-21తో కొరియాకు చెందిన కిమ్ గా యున్ చేతిలో ఓడింది. మొదటి గేమ్ లో ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత ప్రత్యర్థి పైచేయి సాధించింది. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ జోడీ మొదటి రౌండ్ లో 21-17, 21-13తో చైనీస్ తైపీకి చెందిన సంఘ్ షు యున్-యు చీన్ హుయిపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ లో రుత్విక శివాని- రోహిత్ కపూర్ ద్వయం 21-10, 17-21, 24-22తో చైనీస్ తైపీకి చెందిన యి హాంగ్ వీ నికోల్ గొంజాలెస్ చాన్ లపై గెలిచింది.
Previous Articleరోషన్ ” ఛాంపియన్ ” గ్లింప్స్ విడుదల…!
Next Article గుండె పోటుకు చైనా వ్యాక్సిన్…!

