విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై 47 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 213/4 స్కోరు చేసింది. హేలీ మాథ్యూస్ (77) మరియు నట్ స్కివర్ బ్రంట్ (77) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులతో చెలరేగింది. లక్ష్య చేధనలో గుజరాత్ జెయింట్స్ 166 పరుగులకే ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీసి అన్ని వైపులా ప్రభావం చూపింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా ఆమెకే దక్కింది. ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది.
Here are the winners of the #CurvvSuperStriker of the Match, #SintexSixesoftheMatch and #HerbalifeActiveCatchOfTheMatch awards 👌👌@TataMotors_Cars | @Sintex_BAPL_Ltd | #SintexTanks | @Herbalife #TATAWPL | #MIvGG pic.twitter.com/Nr0XnBVjDF
— Women's Premier League (WPL) (@wplt20) March 13, 2025

