తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరస్కరిస్తే,టీటీడీతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు.టీటీడీ పాలక మండలి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.వేసవి సెలవుల్లో భక్తులకు సిఫార్సు లేఖల ద్వారా దర్శన అవకాశమివ్వాలని అన్నారు.తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించాలని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విధానాన్ని కొనసాగించాలని అన్నారు.ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష లేకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని టీటీడీని కోరారు.ఫిబ్రవరి 1 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు ఆమోదిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఎమ్మెల్యేలకు అనుమతి ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయడం అన్యాయం అన్నారు.తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు.గత విధానాన్ని కొనసాగించి తెలంగాణ భక్తులకు కూడా సమాన అవకాశమివ్వాలని కోరారు.
మా సిఫార్సు లేఖలను తిరస్కరిస్తే….టీటీడీతో తేల్చుకుంటాం:- బీజేపీ మెదక్ ఎంపీ,రఘునందన్ రావు
By admin1 Min Read

